బీహార్ నలంద ఇస్లాంపూర్ పీఎస్ పరిధిలో భర్త ముందే భార్యపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న దంపతులపై ఇద్దరు దాడికి పాల్పడ్డారు. తర్వాత భర్తను తీవ్రంగా కొట్టి.. భార్య పై అత్యాచారం చేశారన్నారు. అనంతరం ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.