ఢిల్లీలో యుమునా నది కాలుష్యంతో నురగలు కక్కుతోంది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, మురుగునీటిని యమునా నదిలోకి వదులుతుండటంతో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. కలుషితమైన నీటితో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తోన్న యమునా నది భయానక వీడియోలు వైరల్గా మారడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.