కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఒక నిరుపేద ముస్లిం కుటుంబానికి నెలకు సరిపడే బియ్యం, కిరాణా సామాను సోమవారం అందించారు. అలాగే ప్రతి నెల కూడా ఒక పేద కుటుంబానికి నెలకు సరిపడే సామాను ఇస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కు ముస్లిం కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు.