కాజీపేట మండలం తరాలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఇస్తున్నామని మడికొండ ఎస్ హెచ్ ఓ పుల్యాల కిషన్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.