వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం రాష్ట్ర స్థాయి ఖో ఖో సీఎం కప్-2024 పై యువజన క్రీడల అధికారి సత్యవాణి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్య శారద పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు. డిసెంబర్ 27 నుండి 30 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి ఖో ఖో సిఎం కప్ 2024 ఓ'సిటీ స్టేడియం, వరంగల్‌లో నిర్వహించుటకు వివిధ శాఖల సహకారంతో ఖోఖో పోటీలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.