వరంగల్ జిల్లాలో మత్తు పదార్థాలు, మారకద్రవ్యాల నిరోధకాన్ని సమిష్టి కృషిచేసి యువత విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మత్తు పదార్థాల నియంత్రణపై డిసిపి రవీందర్ తో కలసి సంబంధిత శాఖల అధికారులతో మత్తు పదార్థాల నియంత్రణ పై ఆయా శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.