మేకల తండా కు చెందిన శ్రీనివాస్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ మృదేహానికి ఎంజీఎం మార్చరీలో శనివారం నివాళులర్పించారు. భార్యాభర్తల గొడవలో కొంతమంది అధికార పార్టీ నేతల జోక్యంతోనే పోలీసులు పట్టించుకోలేదని, ఆత్మహత్యకు కారణమైన పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.