వరంగల్ శివనగర్ లో ఆదివారం నగర సిపిఎం పార్టీ శాఖ సదానందం అధ్యక్షతన మహాసభను నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నలిగంటి రత్నమాల మాట్లాడుతూ. భారతదేశంలో రాజ్యాంగం రక్షించబడాలన్న, దాని మౌలిక ఆశయాలు లౌకికతత్వం కాపాడబడాలన్న, సాంఘిక రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగిపోయి ప్రజలు సుఖశాంతులతో బతకాలంటే అది ఎర్ర జెండా ద్వారానే కమ్యూనిజం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.