ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఓ సీటీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై, నగర మేయర్, కలెక్టర్
పాస్టర్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేశారు. పాస్టర్ లందరికీ మంత్రి తన సొంత ఖర్చుతో దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.