లకావత్ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటూ పార్టీ పరంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం మేకల తండాకు చెందిన శ్రీనివాస్ కు గూడూరుకు చెందిన రాధిక వివాహం జరిగింది. శ్రీనివాస్ వేధింపులపై రాధిక ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.