హనుమకొండ: గురుకుల హాస్టళ్లను తనిఖీ చేసిన అధికారులు
హనుమకొండ జిల్లాలోని పలు గురుకుల హాస్టల్స్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం తనిఖీ చేశారు. హాస్టల్స్ తనిఖీలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనంతోపాటు ఆహార పదార్థాలు, కూరగాయలు, గుడ్లు, తాగునీరు, వంట చేసే కిచెన్ ప్రదేశాలను జిల్లా అధికారులు పరిశీలించారు. ధర్మసాగర్ సంబంధించిన గురుకుల పాఠశాల కళాశాల, కేజీబీవీ పాఠశాలను డీఆర్డీఓ మేన శ్రీను తనిఖీ చేశారు.