స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మ సాగర్, వేలేరు లోని అసైన్డ్ భూములను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబీకులే అన్యాక్రాంతం చేస్తున్నారని గురువారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు, దేవునూర్, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామశివారు లోని ఇనుపతిరాతిగుట్టలను, ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూమి ఉండగా కొంతభూమిని ఎమ్మెల్యే అల్లుడు, అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.