విద్య, వైద్య రంగాలలో సమూల మార్పులు తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టాలని దిశ కమిటీ చైర్మన్ వరంగల్ ఎంపీ కడియం కావ్య అధికారులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు.