నదిలో దూకి తల్లి, కుమారుడు ఆత్మహత్య

51பார்த்தது
నదిలో దూకి తల్లి, కుమారుడు ఆత్మహత్య
TG: సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌ మండలం చింతకుంటలో విషాద ఘటన జరిగింది. మంజీర నదిలో ఓ తల్లి, కుమారుడు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులను తల్లి బాలామణి(42), కుమారుడు శ్యామ్(28) గా పోలీసులు గుర్తించారు. వారి మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. వారి మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி