జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను సోమవారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ చెక్కుల ద్వారా అట్టడుగున పేదవారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కులగణనకి ప్రతి ఒక్కరూ సహకరించాలని, కులగణనలో ఎలాంటి సందేహ పడాల్సిన అవసరం లేదని, ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అధికారులకు సహకరించాలని కోరారు.