హనుమకొండ కలెక్టరేట్ లో ఫారెస్ట్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశంను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించారు. దేవూనూరు, నారాయణగిరి, ముప్పారం, ఎర్రబెల్లి గ్రామాల రైతులకు చెందినటువంటి పట్టా భూములను ఫారెస్ట్ అధికారులు అటవీ భూములుగా పరిగణిస్తూ రైతులను పంట పొలాల్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామాల రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.