తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె డాక్టర్ నిఖితా రెడ్డి, డాక్టర్ అవినాష్ రెడ్డి ల వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ఆదివారం మడికొండకు చేరుకున్నారు. వివాహా వేడుకకు హాజరైన సీఎం, మంత్రులు నూతన వధూవరులకు పుష్పగుచ్చాలను ఇచ్చి ఆశీర్వాదాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.