ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ సోమవారం జెడ్డాలో జరిగిన ఐపీఎల్ వేలానికి హాజరయ్యారు. వేలం అనంతరం నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేస్తూ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నామని నీతా అంబానీ తెలిపారు. దేశానికి ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులను తయారు చేయాలన్నారు. ఆ సమయంలో మరాఠీలో తన భావాలను వ్యక్తం చేశారు.