నేటికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం డ్యాన్స్ లేదా స్టంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు ఫేమ్ అవ్వడం కోసం గోడ పై నుంచొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో amandancerbroken అనే ఇన్స్టా ఖాతాలో షేర్ చేయబడింది.