స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ పరిధిలో కూడా బల్దియా ఎస్డీఎఫ్ ద్వారా సుమారు 18కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సమబందించిన ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల స్థానిక నాయకులకు ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు. సిసి రోడ్లు, కమ్యూనిటీ హల్లు, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయితీ భవనాలను అభివృద్ధి చేస్తానన్నారు.