ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల వసతులు కల్పించామని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాలకు రూ 500 ల బోనస్ ను ప్రకటించడం జరిగిందన్నారు.