జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీ కొన్నాయి. లారీ డ్రైవర్ లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్లకు తృటిలో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.