బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

83பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండల కేంద్రం మాటేడు గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాల్గొన్నారు. గ్రామ ఆడపడుచులతో కలసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி