జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం మరియు పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజుల నుండి భారీ ఎండలు కొడుతుండడంతో ఈ వర్షంతో ప్రజల ఆనందంగా ఉన్నారు. బతుకమ్మ పండుగ రోజున పాలకుర్తి ఊర చెరువులో నీళ్లు లేకపోవడంతో దేవుడు కరుణించి వర్షం కురిపిస్తున్నాడని ప్రజలు అంటున్నారు.