వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల రమేశ్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంగళవారం రైల్వే ట్రాక్ పై వీడియో తీసి కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్లో పంపించాడు. వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే మడికొండ పోలీసులు అప్రమత్తమై రమేశ్ కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.