మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెం శివారు నారాయణకుంట, కొర్ర తండా వాసులు రామన్నగూడెం మీదుగా కొర్ర తండాకు వెళ్లే రహదారి చెరువు కట్టే శరణ్యం, ఆ కట్ట రహదారి గుంతలు పడి చిత్తడిగా మారడంతో నిత్యం ప్రయాణించడానికి తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులను స్వయంగా చూసిన కొత్తగూడ ఎస్సై కుశ కుమార్ మంగళవారం చెరువు కట్టపై మొరం పోయించి చదును చేయించారు. గ్రామస్తులు ఎస్సై కి కృతజ్ఞతలు తెలిపారు.