ములుగు జిల్లా మంగపేట మండలంలోని రైతువేదిక వద్ద బుధవారం బిజెపి నాయకులు నిరసన చేపట్టారు. రైతులతో కలిసి రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ధర్నా నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు సతీష్, శ్రీనివాస్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేస్తే ఊరుకోమన్నారు. రైతులకు బిజెపి అండగా ఉంటుందన్నారు.