ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పేర్చిన బతుకమ్మలను గ్రామంలో గుడి వద్దకు మహిళలు తీసుకుని వచ్చి సరదాగా బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని మహిళలు చెప్పుకొచ్చారు.