మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బందితోపాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు 18 ఏళ్ల లోపు వయసుగల బాలబాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హాస్టళ్లలోని బాలబాలికలకు బుధవారం వ్యాక్సినేషన్ సాగింది.
పట్టణంలోని ధర్మన్న కాలనీలో గల కస్తూర్బా బాలికల హాస్టల్ లో 103 బాలికలకు, ఇందిరా నగర్ లోని బాయ్స్ హాస్టల్లో 122 మంది బాలురకు వ్యాక్సినేషన్ జరిపినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా. స్రవంతి, డా. సిహెచ్. రంజిత్ రెడ్డి, రామకృష్ణ, హెచ్ఈఓ, బి. దీనాదయవతి, బి. భవాని, ఎస్పీహెచ్ఓ, కవిత, ఏఎన్ఎం, ఆశాలు వి. రేణుక, ఈ. శారద, బి. మంగ, ఎం. కళావతి, డి. విజయ తదితరులు పాల్గొన్నారు.