డోర్నకల్ మండలం సంకిస గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, ప్రమీల దంపతులు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, కాలం రవీందర్ రెడ్డి, తాళ్ళూరి హనుమా, కాసాం శేఖర్, గండు బాబు, తదితరులున్నారు.