18 ఏళ్ల లోపు వయసుగల బలబాలికల కోసం నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కాంపెయిన్ శుక్రవారంతో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బందితోపాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఈ కాంపెయిన్ లో విశిష్ట సేవలందించారు.
ప్రభుత్వ జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి హరీష్ రాజ్, డిప్యూటీ డిఎం హెచ్ఓ అంబరీష, ఏఎన్ఎంలు పద్మావతి, సువర్ణ, అరుణ, ఆశావర్కర్లు రేణుక, చంద్రకళ, పద్మ, విజయ, మహేశ్వరి, జ్యోతి, జనని, కళ్యాణి, ఉపేంద్ర, నాగలక్ష్మి పాల్గొన్నారు.
పట్టణంలోని ఏకశిలా హోలీ ఏంజెల్స్ ఉన్నత పాఠశాలలో జరిగిన వ్యాక్సినేషన్ లో డా. సిద్ధార్థ, డా. విజయ్ కుమార్, హెచ్. ఈ. ఓ రామకృష్ణ, ఏఎన్ మమత, ఆశ వర్కర్లు జ్యోతి, విజయ, జనని పాల్గొన్నారు.
ఇక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో ఏఎన్ఎంలు దీన దయవతి, ఉమ, ఆశాలు రేణుక, శారదా, కళావతి పాల్గొన్నారు.