గ్రామంలో రోడ్డు సమస్యను పరిష్కరించండి

471பார்த்தது
గ్రామంలో రోడ్డు సమస్యను పరిష్కరించండి
అఖిల భారత గిరిజన సమాఖ్య మహబూబాబాద్ జిల్లా నాయకులు రాజశేఖర్, ఇతర యువకులు ఈ రోజు జిల్లాలోని నెల్లికుదురు మండలంలో గల సౌల్ల తండ గ్రామ పంచాయతీ మరియు గ్రామాలను పర్యటించి అక్కడి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామ ప్రజలు రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించిన గిరిజన నాయకులు వెంటనే ఇట్టి సమస్య గూర్చి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు పంచాయతీ కార్యదర్శికి ఫోన్ ద్వారా వివరించడం జరిగింది.

స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రామ సర్పంచ్ ని స్వయంగా కలిసి గ్రామ ప్రజల సమస్య గురించి వివరించిన తదుపరి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని సూచిస్తు వినతి పత్రం అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி