ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందాలి

555பார்த்தது
ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందాలి
ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందేలా అధికారులు నిర్విరామంగా కృషిచేయాలని కేంద్ర సామాజిక న్యాయ సభ్యులు తురక నరసింహ కోరారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ సమావేశ మందిరంలో వివిధ సంక్షేమ శాఖలు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సంక్షేమం, రెవిన్యూ పోలీస్ అధికారులతో 6 రాష్ట్రాల సామాజిక న్యాయ సభ్యులు సమీక్షించారు. విద్య, వైద్యం శాఖలతో పాటుగా ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, బి. సి. సంక్షేమ శాఖల వారీగా పథకాలు నిర్వహణతో పాటుగా ఆ శాఖలోని ఉప కులాలు, వారి సంక్షేమ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమాధికారులు సమన్వయం పెంచుకోవాలన్నారు. లబ్ధిదారుల జీవితాలను మెరుగు పరిచేందుకు తగిన న్యాయం చేకూర్చేందుకు కేంద్రం ప్రభుత్వంకు నిధుల మంజూరుకు మానవత్వంతో ప్రతిపాదనలను పంపించాలన్నారు. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఇంటి దగ్గరే ఉంటూ విద్యానభ్యసించినందున విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందేందుకు ఉపాధ్యాయులు సల్పిన కృషిని అడిగి తెలుసుకున్నారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు సబ్జెక్టుపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సబ్జెక్టు పై అవగాహన పెంచుకుంటేనే విద్యార్థుల్లో మేధస్సు వికసిస్తుందన్నారు. విద్యలో నాణ్యత అవసరమన్నారు. గత 2 సంవత్సరంల నుంచి నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను, పీడీ యాక్ట్ నమోదు వివరాలను ఇవ్వాలని డి. ఎస్. పి. ని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో సామాజిక న్యాయ సభ్యులకు జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో తొర్రుర్ ఆర్డీఓ రమేష్, డి. ఎస్. పి. సైదయ్య, డి. ఈ. ఓ. మహమ్మద్ అబ్దుల్ హై, గిరిజన సంక్షేమాధికారి దిలీప్ కుమార్, ఎస్సి సంక్షేమాధికారి బాలరాజు, మైనారిటీ సంక్షేమాధికారి శ్రీనివాస్, బి. సి. సంక్షేమాధికారి నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி