ఈ నెల 31 తేదీ వరకు 2వ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ఏఎన్ఎం, ఆశా వర్కర్ల నిర్విరామంగా కృషి చేస్తూ ఇంటింటికీ వ్యాక్సిన్ వేస్తూ, నిరాకరించేవారికి తగు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో ఏఎన్ఎం దీనదయవతి, తార, ఆశ రేణుక, శారద, మంగ, హరిజనవాడలో ఏఎన్ఎం రజిత, ఆశ రేణుక, కోమలత, స్నేహ నగర్ లో ఏఎన్ఎం అరుణ, ఆశ పద్మ, కల్యాణి తదితర సిబ్బంది పాల్గొని ఇంటింటా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించారు.