డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి మండలం
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు లో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామంలో ప్రారంభించారు. మూడు రోజుల పాటు చేయనున్న ఇంటి ఇంటి సర్వే లో స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న, పాలకుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు, ఆర్ ఐ రాకేష్ సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.