వార్షిక తనిఖీల్లో భాగంగా జనగామ పోలీస్ డివిజనల్ కార్యాలయమును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. సోమవారం జనగామ ఏసీపీ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు, వెస్ట్ జోన్ డిసిపి రాజామహేంద్ర నాయక్ , జనగామ పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. ఏసీపీ దర్యాప్తు అధికారిగా వున్న పెండింగ్ కేసుల వివరాలు, నేరస్తుల అరెస్ట్, కేసుల దర్యాప్తు స్థితి గతులపై అడిగి తెలుసుకున్నారు.