భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లో మల్లికార్జునస్వామి బోనాల జాతర సోమవారం వైభవంగా జరిగింది. గ్రామంలోని మల్లన్న ఆలయం ఎదుట ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాలు వేశారు. అనంతరం శివసత్తులు, లక్ష్మీదేవరలు డోలువాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య పూనకాలతో పట్నాలు తొక్కుతూ భక్తులకు భవిష్యవాణి వినిపించారు. మహిళలు నైవేద్యంతో కూడిన బోనాలను వండి సాయంత్రం ఆలయ ప్రదక్షిణ చేసి మల్లన్నకు సమర్పించారు.