భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వరాలయంలో సోమవారం ఆలయ అధికారులు హుండీ లెక్కించారు. అనుబంధ ఆలయాలలో 56 రోజుల వ్యవధిలో భక్తులు కానుకల రూపంలో హుండీలలో వేసిన నగదును ఆలయాధికారులు హుండీలు విప్పి లెక్కించగా రూ. 29, 26, 495నగదు సమకూరినట్లు ఆలయ ఇఓ మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, స్వచ్చంధ సంస్థ సభ్యులు పాల్గోన్నారు.