ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గం"ల నుండి 1 గం"ల వరకు" డయల్ యువర్ డిపో మేనేజర్ " కార్యక్రమం నిర్వహించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసి డిపో మేనేజర్ ఆమంచ ఇందు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు 9959226707 నెంబర్ కు ఫోన్ చేసి ఆర్టీసి అభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.