వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రం దుద్యాల నుంచి నారాయణపేట జిల్లా నాచారం వరకు మంజూరైన తారు రోడ్డు పనులును పంచాయతీరాజ్ శాఖ డిఈ సుదర్శన్ రావు, ఏఈ సురేందర్ రెడ్డిలు పరిశీలించారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. అల్లికన్పల్లి దగ్గర నిర్మిస్తున్న కల్వర్టు పనులను పరిశీలించారు. ఇందులో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య ఉన్నారు.