నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై నివేదిక
ఉమ్మడి గండీడ్ మండలంలో నూతన మండలాల కేంద్రాలు ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఊసే లేదు. మహమ్మదాబాద్ లో పోలీస్ స్టేషన్ ఉండగా.. గండీడ్ లో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఇక గండీడ్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 19 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. గండీడ్ మండలంలో నెలకు దాదాపు 20 దాకా కేసులు నమోదవుతున్నాయి. నూతన పీఎస్ కు ఏర్పాటు చేయడంపై నివేదిక ఇచ్చినట్లు ఎస్పీ డీ. జానకి తెలిపారు.