మహాలక్ష్మి సబ్సిడీ పత్రాలు అందజేత
మహాలక్ష్మి పథకాన్ని అర్హులైన మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి అన్నారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం మండలంలోని రుసుంపల్లి, కప్లాపూర్ గ్రామాలలో సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్స్ ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవన్న, పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్, శోభారాణి, నాయకులు ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.