పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడ్ మండలం సాలర్ నగర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండి అలుగు పారి పరవళ్లు తొక్కుతుంది. ఈ ప్రాజెక్ట్ చూడడానికి చుట్టు గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు. రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లు, చెక్ డ్యామ్ లు, వాగులు, వంకలు, పొంగి పొర్లుతున్నాయి. వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.