వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్. టి. రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ దేశం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజలు మెలగాలని సూచించారు. వారి కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.