నా కూతురిని చూసి 'కోతిపిల్లా' అని హేళన చేసేవారు: పారాలింపిక్ పతక విజేత దీప్తి తల్లి

70பார்த்தது
నా కూతురిని చూసి 'కోతిపిల్లా' అని హేళన చేసేవారు: పారాలింపిక్ పతక విజేత దీప్తి తల్లి
పారిస్ పారాలింపిక్స్‌ 2024లో భారత పారా స్ప్రింటర్ దీప్తి జీవాంజి కాంస్య పతకంతో సత్తా చాటింది. అయితే తన కూతురిని చిన్నతనం నుంచే తోటివారు, గ్రామస్థులు 'కోతిపిల్లా' అని హేళన చేసేవారని దీప్తి తల్లి ధనలక్ష్మి చెప్పుకొచ్చారు. "దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ముఖంపై ఆ ఛాయలు కనిపించేవి. ఆమె తల చాలా చిన్నగా ఉంటుంది. కోతి పిల్ల అని గేలి చేస్తున్నారని దీప్తి బాగా ఏడ్చేది" అని ఆమె చెప్పారు. దీప్తి మేధో వైకల్యంతో జన్మించారు.

தொடர்புடைய செய்தி