టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఫీచర్ ఫోన్ యూజర్లకు, స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు వాడే వారికి ఇది శుభవార్త. డేటా అవసరం లేనివారికి ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.