తిరుపతి ఘటన.. నన్నెంతగానో బాధించింది: బాలకృష్ణ (వీడియో)

70பார்த்தது
ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తనని ఎంతగానో బాధించిందని ప్రముఖ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'డాకు మహారాజ్‌' ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. "తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధాకరం. నన్నెంతగానో కలవరపరిచింది. ఆ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు మా చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని అన్నారు.

தொடர்புடைய செய்தி