ఈత చెట్టుపై నుంచి గీతకార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి 15 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కరీంనగర్(D), కమాన్‌పూర్(M) పెంచికల్‌పేటలో జరిగింది. గ్రామానికి చెందిన ఏగోలపు నర్సయ్యగౌడ్ సోమవారం సాయంత్రం కల్లు గీసేందుకు ఈత చెట్టు ఎక్కి కిందపడటంతో వెన్నెముక, ఇతర అవయవాలకు బలమైన గాయాలయ్యాయి. చుట్టూ దట్టమైన చెట్ల పొదలుండటం, ఎవరూ చూడకపోవడంతో నర్సయ్య లేవలేని స్థితిలో అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్థులు చూడటంతో ఆస్పత్రికి తరలించారు.