తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్ర మంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని CM సూచించారు.