విజయవాడలో భారీ వరదకు వెలగలేరు షట్టర్లు ఎత్తడమే కారణంగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది. వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగులు ఎత్తి దిగువకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కృష్ణా వరద వెనక్కుతన్ని ఎన్టీటీపీఎస్ ప్లాంట్‌లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. దీంతో వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తారు.